Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సినిమా పట్ల విశేషమైన అంకితభావం, మక్కువను చూపించారు. చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత, తెరపై, తెర వెలుపల కూడా ఆయన అసాధారణ వ్యక్తిగా మన్ననలు అందుకుంటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో నిబద్ధతతో ఈ సినిమా షూటింగ్‌లో తన భాగాన్ని పూర్తి చేశారు. ఈ కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి నటీనటులు, సిబ్బందితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ అహర్నిశలు శ్రమించారు. టాకీ పార్ట్‌లో ఎక్కువ భాగం పూర్తి కావడం, షూటింగ్ సజావుగా సాగడం పట్ల నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై నెలకొన్న ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకునేందుకు చిత్ర బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న తరుణంలో చిత్ర బృందం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలు పెట్టనుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దటీజ్ ప్రభాస్! మనోడి మంచి మనసుకు హ్యాట్సాఫ్
మిరాయ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. స్వయంగా లీక్ ఇచ్చిన కార్తీక్
నా తండ్రి తప్పుడు పని చేశాడు.. ఇంట్లో నుంచి గెంటేశా..
