మిరాయ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. స్వయంగా లీక్ ఇచ్చిన కార్తీక్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా మిరాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఈ సినిమా..! ఇందులో తేజసజ్జా, మంచు మనోజ్, శ్రియా, రితిక నాయక్ ప్రధాన పాత్రలలో నటించారు. గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వసూళ్ల ప్రభంజనంతో దూసుకుపోతుంది.
దీంతో ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని… ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టేశాడు. ఏకంగా మెగాస్టార్ చిరు సినిమా ఛాన్స్ కొట్టేశాడు ఈ యంగ్ స్టార్ డైరెక్టర్. అనంతపురానికి చెందిన కార్తీక్ హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ లో బీటేక్ పూర్తి చేశారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాపై ఉన్న ఆసక్తితో దర్శకుడు కావాలనుకున్నాడు. దీంతో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరాడు. తర్వాత రాజీవ్ మీనన్ మైండ్ స్క్రీన్ ఇన్ స్టిట్యూట్ లో చేరి ఏడాది పాటు సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత హర్షవర్దన్ రాణే ప్రధాన పాత్రలో ఇన్ఫినిటీ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. 2013 ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు. ఇప్పుడు మిరాయ్ సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తీక్ ఘట్టమనేని.. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రాబోయే సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్ ను అడగ్గా.. వెంటనే ఓకే చేశారట. కథ ఇంకా వినలేదని.. కానీ చిరంజీవితో సినిమా అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. రెండు పడవల మీద ప్రయాణం చేసే ఆలోచన ఏమీ లేదు.. కానీ చిరంజీవి సినిమా కాబట్టి చేస్తున్నా అని అన్నారు కార్తీక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా తండ్రి తప్పుడు పని చేశాడు.. ఇంట్లో నుంచి గెంటేశా..
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

