చేజేతులా సినిమాలను నాశనం చేసుకుంటున్నారా
ప్యాన్ ఇండియన్ మార్కెట్ మంచిదే.. అన్నిచోట్లా మన హీరోలు జెండా పాతుతుంటే మనకేగా గర్వం. కానీ ఆ మార్కెట్ పిచ్చిలో పడి.. ప్యాన్ ఇండియన్ అప్పీల్ లేని కథలను కూడా బలవంతంగా మన దర్శకులు బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీపై రుద్దాలని చూస్తున్నారా..? అందుకే హిట్టయ్యే సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయా..? ఈ కథేంటో చూద్దామా..? బాహుబలితో ప్యాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది..
ప్యాన్ ఇండియన్ మార్కెట్ మంచిదే.. అన్నిచోట్లా మన హీరోలు జెండా పాతుతుంటే మనకేగా గర్వం. కానీ ఆ మార్కెట్ పిచ్చిలో పడి.. ప్యాన్ ఇండియన్ అప్పీల్ లేని కథలను కూడా బలవంతంగా మన దర్శకులు బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీపై రుద్దాలని చూస్తున్నారా..? అందుకే హిట్టయ్యే సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయా..? ఈ కథేంటో చూద్దామా..? బాహుబలితో ప్యాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది.. ఈ పదేళ్లలో పుష్ప, RRR, సాహో, కల్కి, సలార్, కార్తికేయ 2, హనుమాన్, మిరాయ్ మాత్రమే హిందీలో సత్తా చూపించాయి. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా సక్సెస్ రేట్ 10 శాతం కూడా లేదు.. కానీ ప్రతీ సినిమా ప్యాన్ ఇండియానే మన దగ్గర.. కొన్నేమో చేతులారా నాశనం చేసుకున్నారు. రీజినల్ మార్కెట్ చాలు కదా.. ప్యాన్ ఇండియన్ అప్పీల్ లేని కథలను బలవంతంగా అటువైపు తీసుకెళ్లి చేతులు కాల్చుకోవడం ఎందుకు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అఖండ తెలుగులో బ్లాక్‌బస్టర్.. కానీ సీక్వెల్‌లో ప్యాన్ ఇండియన్ అప్పీల్ కోసం బోయపాటి ఏవేవో చేసి చేతులు కాల్చుకున్నారనే టాక్ వచ్చింది.. అందులో నిజం కూడా లేకపోలేదు. రాజా సాబ్ కూడా అంతే.. మారుతి తెలుగు సినిమాలన్నీ మినిమమ్ గ్యారెంటీ. కానీ ప్రభాస్ అనేసరికి రేంజ్ పెంచి చేతులు కాల్చుకున్నారు. అఖండ 2, రాజా సాబ్ మన భాష వరకు తీసి ఉంటే మంచి సినిమాలయ్యేవి.. కానీ లేనిపోని హంగులకు పోయి మొదటికే మోసం వచ్చింది. ఇకపై అయినా ముందు మన ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆ తర్వాత ప్యాన్ ఇండియా ఆలోచిస్తే బెటర్ ఏమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్టు కోసం హిస్టరీ తవ్వుతున్న యాక్షన్ హీరో
సంక్రాంతి మంచి గుణపాఠం నేర్పిందిగా
NBK111 ముహూర్తం ఫిక్స్.. ఈసారి ప్లాన్ మామూలుగా లేదు