OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రాజెక్టుకి ప్రీక్వెలో, సీక్వెలో చేయాలనుకున్నప్పుడు మేకర్స్ రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటారు. ఎండింగ్‌లో సస్పెన్స్ ఉంచి ఓ రకంగా ప్రమోషన్లు చేసుకుంటారు. నెక్స్ట్ సినిమా మీద హైప్ పెంచి ఇంకో రకంగా ఫేమ్ కావడానికి ట్రై చేస్తుంటారు. కానీ, ఓజీ విషయంలో సుజీత్ ఇంకేదో స్ట్రాటజీని ట్రై చేస్తున్నారు.
దానికీ, అకీరాకి లింకేంటి? ఓజీ సక్సెస్‌ని డల్లాస్‌లోని ఆడియన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు డైరక్టర్ సుజీత్ అండ్ మ్యూజిక్ డైరక్టర్ తమన్. అక్కడ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిదానంగా సమాధానం ఇచ్చారు. అందులో ఓ ప్రశ్నకు సుజీత్ ఇచ్చిన ఆన్సర్ ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది. ఓజీ ప్రీక్వెల్‌లో అకీరా నటించే అవకాశం ఉందా? అని ఆడియన్స్ అడిగితే.. ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ పోతుందన్నారు సుజీత్. నిన్న మొన్నటిదాకా ఓజీ ప్రీక్వెల్‌లో అకీరా ఉంటారా? అని వ్యక్తమైన అనుమానాలకు ఆన్సర్ దొరికినట్టే అయింది. ఓజీ సబ్జెక్టులో అకీరా ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందనే విషయానికి శ్రీకారం చుట్టినట్టే అయింది. సుజీత్‌ని జెన్‌జీ డైరక్టర్ అని పొగిడేశారు పవర్‌స్టార్. ఓజీకి సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటుందని కూడా అన్నారు. ఓజీ విజువల్ బుక్‌ని అకీరా ఎంత ఇంట్రస్ట్ గా చూశారో కూడా షేర్ చేసుకున్నారు. సరిగ్గా అప్పటి నుంచే ఓజీ ఫ్రాంఛైజీలో అకీరా ఉంటారనే టాక్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు నాని మూవీతో బిజీగా ఉన్న సుజీత్.. నెక్స్ట్ అకీరా వెంచరే మొదలుపెడతారా? అనేది ఫిల్మ్ నగర్‌లో షురూ అయిన డిస్కషన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
