OG: ఓజి కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?

Updated on: Oct 01, 2025 | 6:32 PM

చూస్తుండగానే ఓజి ఫస్ట్ వీకెండ్ అయిపోయింది.. మరి ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ఎన్ని..? ఇంకా బ్రేక్ ఈవెన్ ఎంత దూరంలో ఉంది..? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయి..? ఓవర్సీస్ నుంచి వచ్చిందెంత..? అసలెన్ని చోట్ల ఓజి రికార్డులు తిరగరాసింది..? వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు ఏమైనా తగ్గిస్తారా..? చూద్దాం పదండి డీటైల్డ్‌గా.. పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు ఊహిచంనట్లుగానే వీకెండ్ అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి.

ప్యాన్ ఇండియన్ సినిమా కాకపోయినా.. వాటి స్థాయిలోనే పోటీ పడి మరీ వసూళ్లు సాధించింది ఓజి. తెలుగు రాష్ట్రాల్లో 4 డేస్‌లోనే 100 కోట్ల షేర్ అందుకోవడంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా వీకెండ్ అయ్యేనాటికి 145 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఓజి. హిందీ, తమిళంలో నామమాత్రంగానే విడుదలైంది ఓజి. 90 శాతం కలెక్షన్స్ అన్నీ తెలుగు వర్షన్ నుంచే వచ్చాయి. ఈ లెక్కన పవన్ సినిమా మ్యాజిక్ చేసినట్లే. ఓవర్సీస్‌లో ఇప్పటికే 4.4 మిలియన్ దాటి.. 5 మిలియన్ వైపు అడుగులు వేస్తుంది ఓజి. 170 కోట్లకు పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఓజి.. బ్రేక్ ఈవెన్‌కు మరో 30 కోట్ల దూరంలో నిలిచింది. 4 రోజుల్లోనే 252 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పోస్టర్ విడుదల చేసారు. దసరా హాలీడేస్ ఉండటంతో రెండో వారం కూడా ఓజి దూకుడు కొనసాగేలా కనిపిస్తుంది. కాకపోతే టికెట్ రేట్ల విషయంలోనే మేజర్ కంప్లైంట్స్ వస్తున్నాయి.. కనీసం వీకెండ్ అయ్యాకైనా రేట్లు తగ్గిస్తే బాగుండు అంటున్నారు అభిమానులు. మరి చూడాలిక.. దీనిపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజా సాబ్ ట్రైలర్.. మారుతి మాయాజాలం..!

RFCలో SSMB29 కొత్త షెడ్యూల్

ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్.. అప్పటి వరకు రెస్ట్..!

Balakrishna: మరో క్రేజీ కాంబో సెట్‌ చేస్తున్న బాలయ్య

గేమ్ ఛేంజర్ కాంట్రవర్సీపై తమన్‌ రియాక్షన్‌

Published on: Oct 01, 2025 06:31 PM