Balakrishna: బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్
OG సినిమా విజయం, అఖండ 2 రిలీజ్ తేదీ వివాదంపై దర్శకుడు బోయపాటి కీలక విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ OG కోసం బాలకృష్ణే స్వయంగా అఖండ 2 రిలీజ్‌ను వాయిదా వేయించారని బోయపాటి తెలిపారు. బాలయ్య గొప్ప మనసు, ఆ తర్వాత అఖండ 2 ఎదుర్కొన్న అడ్డంకులు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో OG సినిమా మళ్ళీ హాట్ టాపిక్‌గా మారింది.
సెప్టెంబర్ 25న OG సినిమా రిలీజై సూపర్ డూపర్ హిట్టైంది. దాదాపు 300కోట్ల కలెక్షన్స్‌ను కమాయించింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ అయి, అక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా అఖండ2 తాండవం సినిమా కారణంగా మళ్లీ తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అందుకు స్టార్ డైరెక్టర్ బోయపాటే కారణం కావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆఫ్టర్ అఖండ2 సూపర్ డూపర్ హిట్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న బోయపాటి.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అఖండ2 రిలీజ్ వివాదంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే మొదట అఖండ2 సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యామన్నాడు. అయితే పవన్ OG సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతుండడంతో.. పరిశ్రమ మేలు కోరి.. బాలయ్యే తమ సినిమాను ఆపేద్దాం అంటూ చెప్పాడని అసలు విషయం చెప్పాడు. తమ్ముడు పవన్‌కి ఈ రిలీజ్ డేట్ ఇద్దమని బాలయ్యే స్వయంగా తమతో అన్నాడంటూ ఓపెన్ అయ్యాడు. అలా పవన్ కోసం సెప్టెంబర్ 25న పక్కకు తప్పుకున్న తమకు.. డిసెంబర్ 5 అయితే అన్ని విధాలుగా కలిసొస్తుందనే నమ్మకం కలిగిందని.. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా తమ సినిమా డిసెంబర్ 12కు మారాల్సి వచ్చిందన్నారు. కానీ అప్పుడు కూడా రిలీజ్ కు అడ్డంకులు రావడంతో.. తామందరం కాస్త ఆందోళ చెందామంటూ చెప్పుకొచ్చారు. అయితే బోయపాటి చెప్పిన ఈ మాటల కారణంగా ఓజీ సినిమా ఇప్పుడు మళ్లీ తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య మనసు బంగారం అనే కామెంట్ వస్తోంది. అలాంటి బాలయ్య అఖండ తాండవం సినిమా రిలీజ్‌కు.. అడ్డంకులు ఏర్పడడం దురదుష్టకరమని.. భవిష్యతుల్లో ఇలాంటి పరిస్థితుల మళ్లీ రాకూడదంటూ ఎన్బీకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్
Rithu Chowdary: డిమాన్ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!
టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్
పఠాన్ 2లో మన టైగర్.. NTRను నమ్ముకున్న షారుఖ్
300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !! నాగ దుర్గ ఎక్కడికో వెళ్లిందిగా..
