Bigg Boss: అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!

|

Oct 15, 2024 | 4:04 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అన్ని భాషలలో ఈ షో ప్రసారమవుతోంది. అయితే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో ఈ షో హోస్టింగ్ చేస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో మొన్నటివరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా..

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అన్ని భాషలలో ఈ షో ప్రసారమవుతోంది. అయితే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో ఈ షో హోస్టింగ్ చేస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో మొన్నటివరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ స్టార్ హీరో బిగ్‏బాస్ రియాల్టీ షో హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు.

కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా షోను నడిపిన కిచ్చా సుదీప్ ఇప్పుడు షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 11కి హోస్ట్‏గా వ్యవహరిస్తున్న కిచ్చా… ఆ తర్వాత సీజన్‌కి తాను హోస్ట్ గా ఉండనని అనౌన్స్ చేశాడు. ఇక ఈ నిర్ణయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అసలు బిగ్ బాస్ సీజన్‌ 11నుంచి కూడా సుదీప్ తప్పుకోవాలనుకున్నాడట. అయితే చివరి నిమిషంలో షో నిర్వాహకులు సుదీప్‌ని ఒప్పించి కొనసాగించారు. అలా ప్రస్తుతానికి ఈ సీజన్‌ వరకూ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.