AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nelson Dilipkumar: రాజమౌళిని మించి నెల్సన్ మాస్టర్ ప్లాన్.. మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోతో కొత్త సినిమా

Nelson Dilipkumar: రాజమౌళిని మించి నెల్సన్ మాస్టర్ ప్లాన్.. మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోతో కొత్త సినిమా

Phani CH
|

Updated on: Dec 04, 2025 | 1:52 PM

Share

"ఆర్ఆర్ఆర్" సినిమాతో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్లీ కలిసి నటిస్తే ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరి స్టార్ హీరోలను లాక్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. "జైలర్ 2" తర్వాత ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అభిమానుల ఆశలకు త్వరలో తెరపడనుంది.

అంతర్జాతీయ వేదికపై నాటు నాటు బీట్‌ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్​, రామ్ చరణ్​ చేసిన నటన ఇంక కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎస్‌.ఎస్. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’లో సృష్టించిన ఆ మాయాజాలం అందరి మనసుల్లో ముద్రపడిపోయింది. ఈ ఇరువురి కాంబో ప్రేక్షకులకు కనువిందు చేయడమే కాదు.. వారి అద్భుత నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మరి.. ఈ హిట్‌ కాంబో మరోసారి స్క్రీన్‌పై కనబడితే… అదిరిపోతుంది కదూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మరోసారి తారక్-చెర్రీ కాంబో కోసం ప్రేక్షకులు ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు త్వరలో తెరపడే అవకాశం కనిపిస్తోంది! కోలీవుడ్ టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను పాన్ఇండియా స్థాయిలో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ పూర్తైన తర్వాత భారీ మల్టీస్టారర్​ ప్లాన్ చేస్తున్నారట. ఆర్​ఆర్​ఆర్‌తో బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టిన యంగ్​ టైగర్​ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్​ రామ్ చరణ్‌లను మరోసారి ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘జైలర్ 2’లో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్న నేపథ్యంలో, ఈ చిత్రం పూర్తయ్యాకే నెల్సన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఫైనలైజ్ చేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్ట్‌లో హీరోలుగా ఎన్టీఆర్ & రామ్ చరణ్‌లను లాక్ చేయాలని ఆయన గట్టి ప్లాన్‌తో ఉన్నట్టు ఇన్‌సైడ్​ టాక్​. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను ఇప్పటికే నెల్సన్ ఇద్దరు హీరోలకూ నెరేట్ చేశాడని, వారిద్దరూ ఈ ఐడియాకు ఎంతో పాజిటివ్‌గా స్పందించారని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో, నెల్సన్ ప్లాన్ నిజమైతే ఇది పాన్ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఈ మల్టీస్టారర్ ఒక్కసారి అనౌన్స్ అయితే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే స్థాయిలో హైప్ క్రియేట్​ అవుతుందనడంలో సందేహం లేదు!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: AI దుర్వినియోగం పై మండిపడ్డ రష్మిక