NTR ను ఢీ కొట్టేదెవరు?..మేం ముగ్గురయ్యాం! గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక

Updated on: Apr 05, 2026 | 11:41 AM

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో విలన్ సస్పెన్స్ కొనసాగుతోంది. టొవినో థామస్ వైదొలగగా, విమల్ ఒబెరాయ్ పేరు ప్రచారంలో ఉంది. రష్మిక మందన్న "మేం ముగ్గురయ్యాం" అంటూ పోస్ట్ చేయగా, శర్వానంద్ విడాకుల పుకార్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. చిరంజీవి కొత్త సినిమా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వంటి అనేక టాలీవుడ్ విశేషాలు.

టాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమల్లో ఈ వారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం విలన్ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలుత మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ అని భావించినప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ఆయన వైదొలిగారు. ఇప్పుడు విమల్ ఒబెరాయ్ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, రష్మిక మందన్న “మేం ముగ్గురయ్యాం” అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఇది తన పెంపుడు మొక్క, విజయ్ దేవరకొండతో కలిపి చేసిన సరదా పోస్ట్. నటుడు శర్వానంద్ విడాకుల పుకార్లు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు, కుటుంబ చిత్రాలను తొలగించడంతో ఈ ప్రచారం ఊపందుకుంది.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం

Follow Us