నిఖిల్ స్వయంభు ఆలస్యానికి కారణం ఏంటి..?

Edited By: Phani CH

Updated on: Oct 29, 2025 | 3:01 PM

హిట్‌ సౌండ్‌కి అలవాటు పడ్డవారు... తర్వాత తర్వాత ఆ మాటని వినకుండా ఉండటం చాలా కష్టం. ఎప్పుడెప్పుడు విజయాన్ని చూస్తామా? అని వెయిట్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఆ వెయిటింగ్‌ రూమ్‌లో నిఖిల్‌ కూడా ఉన్నారు. అప్పుడెప్పుడో 2022 వైబ్‌ని మళ్లీ ఎప్పుడు ఫీల్‌ అవుతామా? అని ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో 2022లో హిట్‌ చూశారు నిఖిల్‌.

ఆ తర్వాత ఒకటికి రెండు సినిమాలు రిలీజ్‌ అయినా.. ఉపయోగం లేకపోయింది. ఆశించిన విజయం తలుపు తట్టలేదు. కార్తికేయ 2 తర్వాత ప్యాన్‌ ఇండియా రేంజ్‌కి వెళ్తారనుకున్న నిఖిల్‌ జర్నీ ఎందుకో ఉన్నట్టుండి స్లో అయింది. నిఖిల్‌కి ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాల్లో స్వయంభు ఒకటి. షూటింగ్‌‌ 95 శాతం పూర్తయిందని అప్పుడెప్పుడో ఇండస్ట్రీలో మాటలు వినిపించాయి. చాలా వరకు షూటింగ్‌ని సీక్రెట్‌గానే చేసినట్టు మాట్లాడుకున్నారు. చారిత్రాత్మక అంశాలతో ముడిపడిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి నిఖిల్‌కి. స్వయంభు రిలీజ్‌ విషయంలో డిలే జరుగుతోంది. గ్రాఫిక్స్ పనులు మెండుగా ఉండటం, బిజినెస్‌, ఓటీటీ డీల్స్ డిలే కావడం వల్లనే ఈ జాప్యం జరిగి ఉండవచ్చని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. స్వయంభు మాత్రమే కాదు, నిఖిల్‌ నటిస్తున్న ది ఇండియా హౌస్‌ కూడా చాలా సమయాన్నే డిమాండ్‌ చేస్తోంది. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగిన కథతో ఈ మూవీని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒన్స్ పనులన్నీ అయ్యాక బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజులు ఉంటే ఉండొచ్చేమోగానీ, ప్రస్తుతానికి మాత్రం గ్యాప్‌ని బాగా ఫీలవుతున్నారు జనాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pooja Hegde: నయా స్ట్రాటజీ ఫాలో అవుతున్న పూజా

Kriti Sanon: మంచి కాన్సెప్టులతో పలకరిస్తానన్న కృతి సనన్

Mohanlal: త్వరలో దృశ్యం త్రీక్వెల్ సెట్‌ కు మోహన్ లాల్‌

సంక్రాంతికి రంగంలోకి దిగుతున్న మెగాస్టార్, డార్లింగ్

బాలీవుడ్ బ్యూటీస్‌తో పోటీ పడలేకపోతున్న సౌత్ భామలు

Published on: Oct 29, 2025 03:01 PM