2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే

Edited By:

Updated on: Dec 31, 2025 | 5:30 PM

2025లో తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు కొత్త హీరోయిన్లు అద్భుతమైన గుర్తింపు సాధించారు. రితికా నాయక్, అనస్వర రాజన్, అర్చన అయ్యర్, తేజస్విని రావు వంటి వారు తమ మొదటి చిత్రాలతోనే లేదా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ తారలు తమ అద్భుత నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించి, తెలుగు తెరకు కొత్త వెలుగులు తీసుకొచ్చారు. వీరు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది.

2025 ఎవరికి కలిసొచ్చిందో లేదో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో కొందరు కొత్తమ్మాయిలకు మాత్రం బాగా కలిసొచ్చింది. నటించిన మొదటి సినిమాతోనే కొందరు మాయ చేస్తే.. మరికొందరు మాత్రం తమదైన నటనతో అందరి ఫోకస్ తమపై పడేలా చేసుకున్నారు. మరి అలా మాయ చేసిన బ్యూటీస్ ఎవరో చూద్దామా..? మిరాయ్ చూసాక నిజంగానే రితికా నాయక్‌లో ఏదో వైబ్ ఉందని ఫిక్సైపోయారు ఆడియన్స్. ఇందులో సన్యాసినిగా నటించినా.. తన క్యూట్ యాక్టింగ్‌తో అందర్నీ ఫిదా చేసారు రితికా. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ డ్యూయెట్, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజులో నటిస్తున్నారు రితికా. ఇక ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ సైతం 2025లో బాగా మాయ చేసారు. ఛాంపియన్ సినిమాతో అనస్వర పేరు తెలుగులో మార్మోగిపోతుంది. ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టేలా ఉన్నాయి. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో మాయ చేసారు ఈ మలయాళ కుట్టి. ఇక తెలుగమ్మాయిలు సైతం 2025లో బాగా మ్యాజిక్ చేసారు. మొన్న క్రిస్మస్‌కు విడుదలైన శంబాలాలో నటించిన అర్చన అయ్యర్ తెలుగమ్మాయే.. ఇందులో దేవతగా నటించారు అర్చన. ఆదికి కమ్ బ్యాక్ మూవీగా నిలిచిన శంబాలాతో అర్చన అయ్యర్‌ కెరీర్‌కు మంచి పునాది పడింది. ఈ ఏడాది మాయ చేసిన మరో తెలుగమ్మాయి తేజస్విని రావు. రాజు వెడ్స్ రాంబాయిలో రాంబాయిగా కన్నీరు పెట్టించింది ఈ బ్యూటీ. యూ ట్యూబ్ నుంచి నేరుగా వెండితెరపై మ్యాజిక్ చేసింది తేజస్వి. మొత్తానికి కొత్తమ్మాయిలు 2025లో తమ మార్క్ చూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం

టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??

Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు

క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?

Published on: Dec 31, 2025 04:43 PM