తెలుగు ఇండస్ట్రీలో సందడి చేస్తున్న కొత్త హీరోయిన్లు

Edited By:

Updated on: May 14, 2026 | 8:42 PM

చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల సందడి పెరుగుతోంది. రషా తడాని, సారా అర్జున్, ఇమాన్వి ఇస్మాయిల్, రుక్మిణి వసంత్ వంటి కొత్త భామలు క్రేజీ ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ బ్యానర్ల నుంచి కూడా కొత్త ముఖాలు పరిచయం అవుతుండటంతో 2026లో టాలీవుడ్‌లో కొత్త గ్లామర్ వేవ్ కనిపించనుంది.

చూస్తుంటే చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కష్టాలు కాస్త తీరేలా కనిపిస్తున్నాయి. అలాగని వెల్లువలా వచ్చేస్తున్నారని కాదు.. 2026లో కొత్తమ్మాయిల సందడి అయితే బాగానే కనిపిస్తుంది. పైగా వీళ్లందరూ క్రేజీ సినిమాలే చేస్తున్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా క్లిక్ అయ్యేలా కనిపిస్తున్నారు. మరి ఎవరా కొత్త ముద్దుగుమ్మలు..? రషా తడాని.. టాలీవుడ్‌లో కొంతకాలంగా బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాతోనే రవీనా టాండన్ కూతురు రషా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ ఉయ్ అమ్మా అంటూ ఇండియాను ఊపేసిన ఈ బ్యూటీ.. శ్రీనివాస మంగాపురంతో కుర్రాళ్ల గుండెల్ని బాగానే డిస్టర్బ్ చేస్తున్నారు. రషా తడాని తర్వాత అంతగా వినిపిస్తున్న మరో పేరు సారా అర్జున్. ఇప్పటికే ధురంధర్‌తో ఇండియా మొత్తం పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్యే యుఫోరియాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఫౌజీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ సైతం ఇదే ఏడాది ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఫౌజీ విడుదలకు ముందే.. ఇమాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ సైతం డ్రాగన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా 2027లో వస్తున్నా.. టీజర్ మే 20నే రానుంది. అలాగే వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ లాంటి లెజెండరీ బ్యానర్స్ నుంచి సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అలాగే సంబరాల ఏటిగట్టుతో ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరి వీళ్లంతా ఎలాంటి మాయ చేస్తారో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Vijay: ఒక్క విజయంతో మారిపోయిన విజయ్ జాతకం

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అబద్దమే..శారద చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం నిజం !! దీంతో ఆమెకు రూ.574 కోట్ల ఆదాయం

CM Vijay: 0277′ విజయ్‌ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ

స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

Published on: May 14, 2026 08:41 PM
Follow Us