నయనతార పెళ్లి పనులు షురూ.. కాబోయే భర్త కులదైవానికి పూజలు
లేడీ సూపర్‌స్టార్ నయనతార పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడుపుతోంది. పెళ్లికి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న నయనతార... గుళ్లు చుట్టూ తిరుగుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది.
లేడీ సూపర్‌స్టార్ నయనతార పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడుపుతోంది. పెళ్లికి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న నయనతార… గుళ్లు చుట్టూ తిరుగుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. కాబోయే భర్త విఘ్నేష్ శివన్ కులదైవాన్ని దర్శించుకుంది. తంజావూర్ జిల్లా పాపనాశంలోని మేలమరుతరు గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నయనతార స్వయంగా పళ్లెంలో పండ్లు, పువ్వులు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. కాబోయే భర్త విఘ్నేష్ శివన్ కులదైవం వళుత్తియూరి అమ్మవారి పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను ఉంచి పూజలు చేసింది లేడీ సూపర్ స్టార్. నయనతార రాకతో పాపనాశం గ్రామానికి స్థానికులు పోటెత్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: May 25, 2022 08:33 PM