Sai Pallavi: అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా

Updated on: Dec 06, 2025 | 2:12 PM

మన సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోవడం లేదని నిరూపిస్తున్నారు. నయనతార, సాయిపల్లవి వంటి తారలు ప్యాన్ ఇండియా విజయాలతో తమ పారితోషికాన్ని భారీగా పెంచేశారు. బాలీవుడ్‌తో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ అనే అపోహను చెరిపేస్తూ, తమ మార్కెట్ విలువకు తగ్గ డిమాండ్లతో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రష్మిక వంటి వారు కూడా ఈ బాటలో నడిచే అవకాశం ఉంది.

మన హీరోయిన్లకు నార్త్ లో ఎంత క్రేజ్‌ ఉన్నా, ఎన్ని సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించినా అక్కడి వారితో పోలిస్తే.. తక్కువ రెమ్యునరేషనే ఉంటుందనే టాక్‌ ఉంది. అయితే ఇప్పుడు దాన్ని బ్రేక్‌ చేయాలన్న సంకల్పంతో ఉన్నారట ఇద్దరు హీరోయిన్లు ఇంతకీ ఎవరు వారు? నయనతార విషయంలో ఫస్ట్ నుంచీ కొన్ని విషయాలు ఖరాఖండిగా కనిపిస్తాయి. ప్రమోషన్లకి రారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా ఇంటరాక్షన్‌ ఉండదు. ఆమె చెప్పినంత ఇస్తేనే సెట్లో అడుగుపెడతారు అని.. ఇప్పుడు ఆ విషయాలకు తోడు, జవాన్‌ సక్సెస్‌ అయ్యాక లేడీ సూపర్‌స్టార్‌ రెమ్యునరేషన్‌ని కూడా బాగా పెంచేశారనే టాక్‌ నడుస్తోంది. నార్త్ హీరోయిన్లకు మనం ఏం తక్కువ? వారితో పాటే మనం కూడా పారితోషికం డిమాండ్‌ చేయొచ్చనే మైండ్‌ సెట్‌ మనవాళ్లలోనూ ఈ మధ్య బాగానే కనిపిస్తోంది. అందులో లేటెస్ట్ ఎంట్రీ సాయిపల్లవి అని అంటున్నారు. సౌత్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ ఉన్నాయి పల్లవికి. నార్త్ లో ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్‌ మూవీ రామాయణలో నటిస్తున్నారు పల్లవి. దీనికి తోడు మరో హిందీ సినిమాకు కూడా సైన్‌ చేశారట. సో, రీసెంట్‌గా కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌ నుంచి కాల్‌ వెళ్లినప్పుడు.. 15 కోట్లు డిమాండ్‌ చేశారట ఈ లేడీ పవర్‌స్టార్‌. అతి త్వరలోనే ఈ ఫిగర్‌ని రష్మిక కోట్‌ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అయిన మన హీరోయిన్ల రేంజ్‌ బాలీవుడ్‌ భామామణులకు ఏమాత్రం తగ్గేది కాదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవతార్ 3 థియేటర్లలో మహేష్‌ !! హాలీవుడ్‌లో మార్కెట్‌ పై జక్కన్న మాస్టర్ ప్లాన్

iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అన్ననే..