వైరల్‌ వయ్యారికి లేడీ సూపర్‌స్టార్‌ సలహాలు.. ఇంకా హిట్ పక్కనా ??

Edited By: Phani CH

Updated on: Nov 19, 2025 | 3:03 PM

నయనతార, శ్రీలీల ఇటీవల కలిసి కనిపించడంతో వారి మధ్య ఉన్న ఉమ్మడి అంశాలపై చర్చ మొదలైంది. శ్రీలీలకు నయనతార సలహాలు ఇస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రస్తుతం మహిళా దర్శకులతో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు తారల కలయిక, వారి కెరీర్‌లోని సాదృశ్యాలు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించాయి.

ఈ మధ్య నయన్‌ అండ్‌ శ్రీలీలను ఒకట్రెండు చోట్ల కలిపి చూసిన వాళ్లందరూ వాళ్లల్లో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ని పిక్‌ చేసే పనుల్లో ఉన్నారు. ఇద్దరినీ కలిపిన విషయం ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడుతున్నారు. శ్రీలీలకు నయన్‌ గైడెన్స్ ఇస్తున్నారా? అని కూడా మాట్లాడుకుంటున్నారు. వైరల్‌ వయ్యారి అనిపించుకున్న యూత్‌ ఐకాన్‌ వ్రీలీల. ఇప్పుడు తెలుగులోనే కాదు, బ్యాక్‌ టు బ్యాక్‌ కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలతోనూ బిజీ అవుతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొత్త పరిచయాలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తూనే ఉన్నారు కిస్సిక్‌ బ్యూటీ. తాజాగా నయనతారతో కలిసి కనిపిస్తున్నారు శ్రీలీల. యాదృచ్ఛికంగా జరిగినా, ప్లాన్ ప్రకారమే కలిసి ట్రావెల్‌ చేసినా.. వీళ్లిద్దరి మధ్య ఉన్న భక్తిని కామన్‌ పాయింట్‌గా చెప్పుకుంటున్నారు జనాలు. అంతే కాదు, నయన్‌ అండ్‌ శ్రీలీల.. ఇద్దరూ ఇప్పుడు లేడీ డైరక్టర్లతో పనిచేస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు. టాక్సిక్‌తో మలయాళీ లేడీ గీతూ మోహన్‌దాస్‌ కెప్టెన్సీకి నయన్‌ ఓకే చెబితే, పరాశక్తితో సుధా కొంగరకు శ్రీలీల ఓకే చెప్పేశారన్నమాట. ఇలా కామన్‌ క్వాలిటీస్‌ ఇంకేమైనా గుర్తుకొస్తే షేర్‌ చేసుకుందాం అంటూ సరదాగా చర్చ షురూ చేశారు నెటిజన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుస షూటింగ్స్ తో షేక్ అవుతున్న లొకేషన్స్..

Top9 ET: ‘వారణాసి’ టైటిల్‌ వివాదం జక్కన్నకు దెబ్బ మీద దెబ్బ

పాపులారిటీ ఏమో కానీ.. తన భర్త విషయంలో ఈ నటికి తీవ్ర బాధ

Babar Azam: బాబర్‌పై ఐసీసీ కొరడా.. లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఫైన్‌

5 ఫోర్లు, 3 సిక్సర్లతో బుడ్డోడి బీభత్సం