మల్లెపూలు పెట్టుకున్న నటికి భారీ ఫైన్.. ఎయిర్‌పోర్ట్‌లో వింత అనుభవం

Updated on: Sep 08, 2025 | 9:46 PM

మలయాళ నటి నవ్య నాయర్‌ కు ఆస్ట్రేలియాలో ఊహించని ఘటన ఎదురైంది. మల్లెపూలు బ్యాగ్‌లో పెట్టుకుని ఆస్ట్రేలియా వెళ్లినందుకు ఆమెకు భారీ జరిమానా పడింది. ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు షాకిచ్చారు. ఈ విషయాన్ని నవ్య నాయర్ తెలిపింది. ఓనం సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్‌ ఆమెను ఆహ్వానించింది.

నటి నవ్య నాయర్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ఆ సమయంలో ఆమె జడలో ఇంకా బ్యాగ్‌లో మల్లెపూలు ఉన్నాయి. దీంతో మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆమెను ఆపారు. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా 1.14 లక్షల రూపాయల ఫైన్‌ వేశారు . ఆస్ట్రేలియా వచ్చే ముందు తన తండ్రి మల్లెపూల దండ కొనిచ్చారని నవ్య చెప్పింది. తన తండ్రి ఇచ్చిన పూలలో కొన్నింటిని జడలోనూ, మరికొన్నింటిని బ్యాగ్‌లోనూ పెట్టుకున్నానని తెలిపింది. అది తెలియక చేసిన పొరపాటని చెప్పింది. అధికారులు తనకు 1.14 లక్షల జరిమానా విధించారని, 28 రోజుల లోపు చెల్లించాలని నోటీస్ ఇచ్చారని నవ్య అంది. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైనా ఆస్ట్రేలియాకు పువ్వులు తీసుకెళితే ముందుగానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. మొక్కలకు సంబంధించిన వాటిని తీసుకొచ్చే ముందే డిక్లేర్ చేయకపోతే భారీ జరిమానా, క్రిమినల్ చార్జ్‌లను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. బయో సెక్యూరిటీ విషయంలో ఆస్ట్రేలియా కఠిన నిబంధనలను అనుసరిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్‌

ఆటో డ్రైవర్‌కు దొరికిన బంగారం బ్యాగ్‌.. డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్

త్వరలో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలు.. కంప్యూటర్లుగా మారనున్న పాత టీవీలు

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ