ప్రాణాలకు రిస్క్.. అయినా తగ్గని సోనూసూద్ వీడియో
పంజాబ్‌లో వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది చనిపోయారు. 1.45 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. భారీగా పంట నష్టం సంభవించింది. 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వరదలు భీభత్సం సృష్టించాయి. పంజాబ్‌లో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు.
వర్షం పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లడం రిస్క్ అని తెలిసినా సోనూసూద్ వెనకడుగు వేయలేదు. వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయాయని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అక్కడి ప్రజలకు సహాయం చేయడం అన్నది వారంలోనో, పది రోజుల్లోనో అయ్యే పని కాదని అన్నారు. పంజాబ్ కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని, పంజాబ్ కోసం నిలబడేవారు తమకు చాలా అవసరమని అన్నారు. ఇళ్లు కూలిపోయి ఇబ్బంది పడుతున్న వారికి తను ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. సోనూసూద్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు లేదనకుండా అడిగిన వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. తన అవసరం ఉన్న చోటుకు నేరుగా వెళుతున్నారు. స్వయంగా తన చేతులతోనే సహాయం చేసి వస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సోనూసూద్. వరదల కారణంగా నష్టపోయిన గ్రామాలకు సహాయం అందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో
వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
