బాలయ్య రేర్ రికార్డ్.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, వీరిలో బాలయ్య మాత్రం తన కెరీర్ చివరి దశలో ఒక అరుదైన మైలురాయిని అందుకుని, తన తరం హీరోలకు అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేశారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అఖండ 2 తాండవం’. ఈ సినిమాతో బాలయ్య ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. ‘అఖండ 2 తాండవం’ హిందీ వెర్షన్‌లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న టాలీవుడ్ సీనియర్ హీరోగా బాలకృష్ణ హిస్టరీ కెక్కాడు. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’తో పాన్ ఇండియా సినిమా చేసినా.. నాగార్జున, వెంకటేష్‌లు డైరెక్ట్ హిందీ సినిమాలు చేసినా కూడా… వారిలో ఎవరూ కూడా తమ తెలుగు సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పిన సందర్భాలు లేవు. యువ హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నప్పటికీ, సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఒక్కమగాడు బాలకృష్ణ మాత్రమే. అంతేకాదు, గతంలో భగవంత్ కేసరి సినిమాకు కూడా ఆయనే హిందీ డబ్బింగ్ చెప్పారు
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
