న్యూ ఇయర్ వేళ మహేష్ ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న నమ్రతా
నూతన సంవత్సరం వేళ నమ్రత శిరోద్కర్ మహేశ్ బాబు కుటుంబ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఆనందకర క్షణాలు నెట్టింట వైరల్ అయ్యాయి. సితార బుగ్గపై మహేశ్ బాబు ముద్దుపెడుతున్న దృశ్యం, నమ్రత గౌతమ్‌తో సెల్ఫీ అభిమానులను ఆకట్టుకున్నాయి. కృతజ్ఞతతో 2026కి స్వాగతం పలికారు. 2025 జ్ఞాపకాలను కూడా ఆమె పంచుకున్నారు.
నూతన సంవత్సరం వేళ అభిమానులకు మహేష్‌బాబు అర్ధాంగి నమ్రత స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. కుటుంబంతో కలిసి మహేశ్ బాబు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో మహేశ్ బాబు తన కుమార్తె సితార బుగ్గపై ప్రేమగా ముద్దుపెడుతున్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో ఫోటోలో సితార ‘న్యూ ఇయర్’ అని రాసి ఉన్న హెయిర్‌బ్యాండ్ ధరించి కనిపించింది. ఇంకో ఫోటోలో, నమ్రత తన కుమారుడు గౌతమ్‌తో కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. ఈ పోస్ట్‌కు ఆమె ఓ చక్కటి వ్యాఖ్యను కూడా జత చేశారు. కృతజ్ఞతతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కుటుంబంతో కలిసి 2026కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని నమ్రత పేర్కొన్నారు. అంతకుముందు, డిసెంబర్ 31న నమ్రత 2025 సంవత్సరానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో మహేశ్ బాబు, పిల్లలు సితార, గౌతమ్, తన సోదరి శిల్పా శిరోద్కర్, కుటుంబ సభ్యులు, సిబ్బందితో గడిపిన క్షణాలు, వెకేషన్స్ వంటివి ఉన్నాయి. ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన నమ్రత, ‘వాస్తవ్’, ‘పుకార్’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. 2005లో మహేశ్ బాబును వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఈ దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ ప్యాకేజీతో సంచలనం సృష్టించిన హైదరాబాద్ విద్యార్థి
