మళ్లీ సందడి చేస్తున్న మైల్‌ స్టోన్‌ మూవీస్‌ వీడియో

Updated on: Oct 26, 2025 | 4:59 PM

తెలుగు సినిమా చరిత్రలో మైల్‌స్టోన్‌లుగా నిలిచిన బాహుబలి, శివ చిత్రాలు రీ-రిలీజ్‌ అవుతున్నాయి. పదేళ్ల బాహుబలి అక్టోబరు 31న, రామ్ గోపాల్ వర్మ శివ నవంబరు 14న విడుదల కానున్నాయి. అభిమానులు ఈ క్లాసిక్స్‌ను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భారీ వసూళ్లు సాధిస్తాయని అంచనాలున్నాయి.

తెలుగు సినిమా హిస్టరీలో మైల్ స్టోన్‌లుగా నిలిచిన బాహుబలి, శివ చిత్రాలు రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు క్లాసిక్స్ స్వల్ప విరామంతో మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మేకర్స్ కూడా ప్రమోషన్లలో వేగం పెంచారు.బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మేకర్స్ అక్టోబరు 31న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ-బుకింగ్స్‌లో మంచి స్పందనను చూపిస్తోంది. రీమాస్టర్డ్‌ వెర్షన్‌ను మళ్లీ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో, ఈ రీ-రిలీజ్‌లోనూ 50 కోట్ల రూపాయల మార్కును చేరుకుంటుందని అంచనాలున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో