Kushboo: మా నాన్నే నన్ను లైంగింగా వేధించాడు.. ఖుష్బూ సంచలన వీడియో..

|

Mar 15, 2023 | 8:58 PM

ఎనిమిదేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌ ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎనిమిదేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌ ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కన్నతండ్రే తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేశారు. కన్నబిడ్డలకు రక్షణకవచంలా ఉండాల్సిన తండ్రినుంచే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, తనను ఎంతగానో గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. ఈ విషయం తన తల్లికి చెప్పినా, భర్తే తన దైవంగా భావించే మనస్తత్వం ఆమెదని, అందుకే ఆమెకు చెప్పేందుకు కూడా భయపడేదాన్నని తెలిపారు.అభం శుభం తెలియని వయసులో చిన్నారులు లైంగిక వేధింపులకు గురైతే ఆ భయం వారిని జీవితాంతం వెంటాడుతుందన్నారు. తన తండ్రి వల్ల తల్లి ఎన్నో కష్టాలు పడిందన్నారు. తనకు 15 ఏళ్ల వయసు వచ్చేసరికి తండ్రి అకృత్యాలను ఎదుర్కోవడం ప్రారంభించానని, ఆ తర్వాత ఏడాదికి ఆయన తమను వదిలి వెళ్లిపోయారని తెలిపారు. ఆ సమయంలో తామె ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని ఖుష్బూ వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 08:58 PM