Vijay Thalapathy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే! దెబ్బకు మైండ్ బ్లాక్ కదూ

Updated on: Mar 13, 2025 | 1:48 PM

తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంత పార్టీని స్థాపించిన ఈ హీరో.. తదుపరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ, అధికార డిఎంకె పార్టీపై నిరంతరం విమర్శలు చేస్తున్న విజయ్, తన పార్టీకి వివిధ వర్గాల నుంచి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవల ముస్లీమ్స్ కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలతో కలిసి ప్రార్థన చేశాడు. కానీ ముస్లింల మద్దతు పొందే విజయ్‌ చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. విజయ్‌ పై ముస్లింలే ఫిర్యాదు చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు.. సౌత్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ ఇఫ్తార్ విందు ఇస్లాంను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ తమిళనాడు సున్నత్ జమాత్ నాయకుడు విజయ్ పై ఫిర్యాదు చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసి విజయ్‌పై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీస్ కమిషనర్‌కు కోరారు. విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఇస్లాంను, ముస్లింలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు సున్నత్ జమాత్ నాయకుడు. అంతేకాదు విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో తాగుబోతులు, రౌడీలు పాల్గొన్నారని ఆరోపించాడు. ఉపవాసం ఉండని, రంజాన్ పట్ల గౌరవం లేని వ్యక్తులు కూడా విజయ్‌ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ముస్లిం సమాజానికి అవమానమన్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శంకర్‌కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్

TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్‌ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్

పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా

Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?

జాబిల్లిపై మరిన్ని చోట్ల మంచు కనుగొన్న చంద్రయాన్-3