‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్

Updated on: Oct 24, 2025 | 7:03 PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ బర్త్‌ డే వేడుకలను ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోకి బర్త్‌ డే విషెస్ చెబుతూ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా డార్లింగ్‌కు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అందులో మోహన్ బాబు ప్రభాస్‌కు విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ మోహన్ బాబు ఏమని ట్వీట్ చేశారంటే… “నా ప్రియమైన డార్లింగ్ బావా.. ప్రభాస్, మొత్తం దేశం గర్వించదగ్గ వ్యక్తివి నువ్వు. నీవు అంతులేని ఆనందంతో దీవించబడాలి,. మరిన్ని పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలి. నీవు వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా, నువ్వు త్వరలో వివాహం చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! హృదయపూర్వకమైన ప్రేమతో, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించే మీ బావా.” అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2025 లో నాగుల చవితి ఎప్పుడు.. వివరాల కోసం ఈ వీడియో చూసేయండి

అహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ కాగానే.. కూలిన విమానం

అప్పుగా పెట్రోల్‌ పోయలేదని.. పొట్టు పొట్టు కొట్టిన ఖాకీ

నవంబరు 1 నుంచి బ్యాంక్‌ల కొత్త రూల్స్‌ ఇవే

వారికి బంపరాఫర్‌.. గ్రాము బంగారంపై రూ.9,700 లాభం