తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు

Updated on: Jan 20, 2026 | 4:39 PM

మన శంకరవరప్రసాద్‌గారు చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, నార్త్ అమెరికాలో మెగాస్టార్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. బుక్ మై షో రికార్డులను కూడా అధిగమించిన ఈ చిత్రం, ఇప్పటికే 261 కోట్లు వసూలు చేసి 300 కోట్ల మైలురాయి వైపు దూసుకెళ్తోంది. ఇది మెగాస్టార్ తిరుగులేని స్టార్‌డమ్‌కు నిదర్శనం.

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అనే మాటను ఊరికే అనడం లేదు జనాలు. రోజు రోజుకీ లెక్కలు వావ్‌ అనిపిస్తున్నాయి. రికార్డులను బద్ధలు కొడుతూ ముందుకు దూసుకెళ్తోంది మన శంకరవరప్రసాద్‌గారు మూవీ. థియేటర్లలో ఫ్యామిలీస్‌ సందడి చేస్తే, బాక్సాఫీస్‌ దగ్గర నెంబర్లు గలగలలాడుతున్నాయి. ఇంతకీ మన శంకరవరప్రసాద్‌గారు లేటెస్ట్ రికార్డులేంటి? జస్ట్ ఆరు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయింది మన శంకరవరప్రసాద్‌గారు. ఆల్‌ ఏరియాస్‌ బ్రేక్‌ ఈవెన్‌ కంప్లీటెడ్‌ ఇన్‌ సిక్స్ డేస్‌ అంటూ హ్యాపీగా పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్. అంతేనా అంటే.. నార్త్ అమెరికాలో మెగాస్టార్‌ కెరీర్‌లో ఆల్‌ టైమ్‌ హయ్యస్ట్ గ్రాస్సింగ్‌ సినిమాగానూ రికార్డు క్రియేట్‌ చేసింది. అక్కడ మూడు మిలియన్ల మార్క్ వైపు అడుగులు వేస్తోంది. ఇటు బుక్‌ మై షోలో ఓజీ ఫైనల్‌ సేల్స్ ని సర్‌పాస్‌ చేసి, అంతే వేగంగానూ దూసుకుపోతోంది మన శంకరవరప్రసాద్‌గారు. బీయంయస్‌ ఓజీ ఫుల్‌ రన్‌ 2.78 మిలియన్లుగా రికార్డు కాగా, మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి ఆరు రోజుల్లో 2.81 మిలియన్లు వసూలయ్యాయి. మరోవైపు ఇప్పటికే 261 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని పోస్టర్‌ వేసిన మేకర్స్, 300 కోట్ల పోస్టర్‌ ఎప్పుడెప్పుడు ప్రిపేర్‌ చేయబోతున్నామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్‌ టైమ్‌ రీజినల్‌ ఇండస్ట్రీ హిట్‌ అనే పోస్టర్‌ని చూడ్డానికి కూడా మరెంతో సమయం పట్టదన్నది ట్రేడ్‌ పండిట్స్ చెబుతున్న మాట. ట్రిపుల్‌ ఆర్‌ ఇండస్ట్రీ రికార్డును ఐదో రోజే క్రాస్‌ చేసిన క్రెడిట్‌ని ఆల్రెడీ సొంతం చేసుకున్నారు మెగా అనిల్‌. ఇవన్నీ చూస్తుంటే ది అల్టిమేట్‌ స్టార్‌ ఆఫ్‌ తెలుగు సినిమా అనే టైటిల్‌ మెగాస్టార్‌కి యాప్ట్ అంటూ హ్యాపీగా సందడి చేస్తున్నారు అభిమానులు. ఏపీ, తెలంగాణ పరంగా ఆరు రోజుల హయ్యస్ట్ షేర్‌ కలెక్టట్‌ సినిమాలతోనూ అనిల్‌ రావిపూడికి ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఉంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఆరో రోజు 14.05 కోట్లు కలెక్షన్లు చూసిన అనిల్‌, ఇప్పుడు మన శంకర వరప్రసాద్‌గారితో 13.85 కోట్లు అందుకున్నారు. హిట్‌ మిషన్‌ అనే ట్యాగ్‌ లైన్‌కి అనిల్‌ పర్ఫెక్ట్ అంటూ ఈ విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా

కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్.. యాక్షన్ రూట్ లో సీనియర్ బ్యూటీస్