Megastar Chiranjeevi Family: అయోధ్య రాములోరి చెంతకు కుటుంబ సమేతంగా మెగాస్టార్..
రఘురాముడు కొలువైన అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు గానూ దేశంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు నిర్వాహకులు.
రఘురాముడు కొలువైన అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు గానూ దేశంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు నిర్వాహకులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగం కానున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.
తాజాగా తనకు కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశరు. ఈనెల 22న కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లనున్నామని ఆయన తెలిపారు. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన హనుమాన్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరు.. ‘అయోధ్య రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ మహోత్తర కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మా కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్తున్నాను’ అని ప్రేక్షకులకు తెలియజేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos