Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్

Edited By: Phani CH

Updated on: Nov 18, 2025 | 1:45 PM

మెగాస్టార్ చిరంజీవికి కోల్‌కతా అంటే ప్రత్యేక అభిమానం. 'చూడాలని ఉంది', 'భోళా శంకర్' వంటి చిత్రాల్లో బెంగాల్ నేపథ్యాన్ని వాడారు. తాజాగా బాబీ దర్శకత్వంలో రానున్న మరో చిత్రానికి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు పచ్చజెండా ఊపారు. భోళా శంకర్ నిరాశను అధిగమించి, మరోసారి కోల్‌కతా మ్యాజిక్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

టాలీవుడ్‌కీ, కోల్‌కతాకి ఓ మంచి రిలేషన్‌ ఉంటూనే ఉంటుంది. మన హీరోలకి అక్కడి పేర్లు పెట్టుకోవడం, బెంగాలీ సందుల్లో మన పాటలు చేయడం.. ఏదైతేనేం.. హౌరా బ్రిడ్జి సాక్షిగా మనకు కోల్‌కతా అంటే అదో రకమైన ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలా సార్లు చూపించారు మెగాస్టార్‌. ఇప్పుడు మరోసారి బెంగాల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీకి పచ్చజెండా ఊపేశారు. చూడాలని ఉంది సినిమా చూసిన వారికి గంగూలీ సందులో గజ్జెల గోల గురించి స్పెషల్‌గా పరిచయాలేం అక్కర్లేదు. ఆ సినిమా అప్పట్లో చేసిన సందడి ఆ రేంజ్‌లో ఉండేది మరి. ఇప్పటికీ చూడాలని ఉంది సినిమాను మర్చిపోలేరు జనాలు. చూడాలని ఉంది మాత్రమే కాదు.. రీసెంట్‌ రిలీజ్‌ భోళా శంకర్‌లోనూ బెంగాల్‌ బ్యాక్‌ డ్రాప్‌ని వాడుకున్నారు మేకర్స్. మెగాస్టార్‌ని బెంగాల్‌ వీధుల్లో చూడ్డం ఓ ఎమోషన్‌ అంటారు హార్డ్ కోర్‌ ఫ్యాన్స్. భోళా శంకర్‌ పెద్దగా ఆకట్టుకోలేదు జనాలను. ఆ కొరత ఎందుకనుకున్నారేమో.. మరోసారి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలని ఫిక్సయ్యారు మెగాస్టార్‌ చిరంజీవి. భోళా శంకర్‌ చేదు జ్ఞాపకాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిరు. బాబీ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. ఆల్రెడీ బాబీ మేకింగ్‌ స్టైల్‌ తెలుసుకాబట్టి, ఈ సబ్జెక్టుని బాగా డీల్‌ చేస్తారని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు చిరు. సో.. మరోసారి జనాల్లో పూనకాలు లోడింగ్‌ అన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యానిమేషన్‌ ప్రధానంగా ప్రభాస్‌ – ప్రేమ్‌రక్షిత్‌ సినిమా

హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా

ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??

కొత్త సినిమాలకంటే.. రీ రిలీజ్ సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి

మాకు పక్కా హిట్ కావాల్సిందే.. తాడో పేడో తేల్చుకుంటున్న హీరోలు..

Published on: Nov 18, 2025 01:45 PM