Godfather : గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ హిట్.. ఫ్యాన్స్‌కు మెగాస్టార్ థ్యాంక్స్.. సక్సెస్ సెలబ్రేషన్
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆచార్య సినిమా తర్వాత హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి బిరియాని లాంటి హిట్ ఇచ్చింది గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ కంటే బాగుంది అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, సత్యదేవ్, అనసూయ నటించారు. ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ సాధించడంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Published on: Oct 08, 2022 08:45 PM
