Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్

Updated on: Jan 31, 2026 | 1:57 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుత ఫిల్మ్ లైనప్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు అట్లీ, లోకేష్ కనరాజ్, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకులతో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే, చరణ్ మాత్రం సుకుమార్ సినిమా తర్వాత తన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌.. ఫిల్మ్ లైనప్‌లో కాస్త వెనబడ్డారనే కామెంట్ నెట్టింట బలంగా వస్తోందిప్పుడు. మెగా కాంపౌండ్‌ హీరో అల్లు అర్జున్‌ ఇప్పటికే వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఓ పక్క అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తూనే.. మరో పక్క లోకేష్ కనరాజ్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. వాయిస్ మరో పక్క సందీప్ రెడ్డి వంగా.. సుకుమార్, త్రివిక్రమ్‌లతో వరుస సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇక బన్నీలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన ఫిల్మ్ లైనప్‌లో క్లియర్‌గా ఉన్నాడు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ మూవీ చేస్తున్న తారక్.. ఈసినిమా తర్వాత దేవర 2 సినిమాతో పాటే.. నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాలను క్యూ లో పెట్టేశాడు. మరో పక్క ప్రభాస్‌ అయితే చాంతాడంత పాన్ ఇండియా లిస్టులో టాప్‌లో ఉన్నాడు. కానీ చరణ్‌ మాత్రం.. ఈ విషయంలో కాస్త వెనకపడే ఉన్నారు. ఎట్ ప్రజెంట్ పెద్ది సినిమా చేస్తున్న చరణ్.. ఈసినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. అయితే ఆ తర్వాత ఏంటనే విషయంలో చరణ్ కాంపౌండ్‌ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడమే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?

Om Shanti Shanti Shantihi: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా హిట్టా..? ఫట్టా..?

Jr NTR : నా పేరు వాడేటప్పుడు జాగ్రత్త! హెచ్చరించిన NTR

Varanasi: నేషనల్ లెవల్ లో ట్రెండ్ అవుతున్న వారణాసి

Krithi Shetty: సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కృతి శెట్టి