Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా

Updated on: Dec 18, 2025 | 5:31 PM

వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ, రొటీన్ సినిమాల విమర్శల నేపథ్యంలో తన పారితోషికాన్ని తగ్గించుకున్నారు. 'ధమాకా' తర్వాత హిట్ లేకపోవడంతో, ఆయన మార్కెట్ దెబ్బతింది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన మాస్ రాజా, ఇప్పుడు ప్రాఫిట్ షేర్ తీసుకుంటూ కొత్త సినిమాలకు ఓకే అంటున్నారు. ఫ్యామిలీ, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్‌లతో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు.

రవితేజకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయిందా..? వరసగా అరడజన్ ఫ్లాపులు పడితే గానీ అసలు విషయం బోధ పడలేదా..? ఈయన రెమ్యునరేషన్ తగ్గిపోయిందా లేదంటే మాస్ రాజానే కావాలని తగ్గించుకున్నారా..? అసలు రవితేజ విషయంలో ఏం జరుగుతుంది..? రొటీన్ నుంచి బయటికి వచ్చి.. డిఫెరెంట్‌గా ట్రై చేస్తున్నారా..? మాస్ రాజా ఫ్యూచర్ ప్లానింగ్‌పై స్పెషల్ స్టోరీ.. రవితేజ సినిమా అంటే ఒకప్పుడున్న ఆసక్తి కనిపించట్లేదిప్పుడు. మరీ రొటీన్ సినిమాలు చేస్తున్నారనే విమర్శలు ఈయనపై గట్టిగానే ఉన్నాయి. వాటి ఫలితమే వరస ఫ్లాపులు. ధమాకా తర్వాత ఈయనకు మరో హిట్ లేదు. ఈ హీరోపై ఉన్న మరో కంప్లైంట్.. భారీ రెమ్యునరేషన్. ఫ్లాపుల్లోనూ సినిమాకు పాతిక కోట్లు వసూలు చేస్తారని మాస్ రాజాపై విమర్శలు బానే ఉన్నాయి. వరస ఫ్లాప్స్ రవితేజ మార్కెట్‌ను బాగా దెబ్బ తీసాయి. అందుకే పారితోషికంలో తగ్గక తప్పట్లేదు. ప్రస్తుతం కిషోర్ తిరుమలతో చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు గతం కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు మాస్ రాజా.. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సంక్రాంతికి విడుదల కానుంది. పారితోషికం తగ్గించుకున్నా.. ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకుంటున్నారు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమాకు కూడా రవితేజ తక్కువలోనే చేస్తున్నారు. థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాకు ఇరుముడి టైటిల్ పరిశీలిస్తున్నారు. విశ్వంభర ఫేమ్ వశిష్టతో ఓకే అయిన సైన్స్ ఫిక్షన్ సినిమాకు కండీషన్స్ అప్లై అంటున్నారు మేకర్స్. మొత్తానికి వరస ఫ్లాపులతో మాస్ రాజా రెమ్యునరేషన్ తగ్గించక తప్పలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..

Demon Pavan: అప్పుడు ఇజ్జత్‌ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు

Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ దక్కించున్న భరణి

నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??

Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??

Published on: Dec 18, 2025 05:22 PM