Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..

Updated on: Sep 18, 2025 | 1:13 PM

కొన్నాళ్లుగా కుటుంబంలో గొడవలు.. కెరీర్ పరంగా ఇబ్బందులు.. చేసిన సినిమాలేమో ఫ్లాపులు.. ఇలాంటి సమయంలో మంచు మనోజ్ టైమ్ ఇన్నాళ్లకు స్టార్ట్ అయిందా..? మిరాయ్‌తో మనోజ్ 2.0 లా మారిపోడా? అసలు మిరాయ్‌ సక్సెస్ మీట్‌లో... స్టేజ్ పై ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు? మంచు వారసుడికి కష్టాలు ఏమున్నాయి..? ఇవి ఆయన ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు.. ఫిల్మ్ లవర్స్‌ మైండ్స్లో కూడా దాగున్న ప్రశ్నలు.

మిరాయ్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ తనకు మాత్రం ఊపిరి పోసింది. తననే కాదు.. తన కుటుంబాన్నే కాపాడింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. దీన్నిబట్టి ఈ సినిమా అతడికి ఎంత కీలకమో అర్థమైంది. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ మధ్యే భైరవం సినిమాలో విలన్‌గా నటించారు మనోజ్.. కానీ అది వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన మిరాయ్‌తో పాన్ ఇండియన్ యాక్టర్ అయిపోయారు మనోజ్‌. సపోర్టింగ్ రోల్స్ చేస్తే మనోజ్‌కు ఆఫర్స్ క్యూ కడతాయి. పైగా మంచి పర్ఫార్మర్ కూడా..! ఇన్నాళ్లూ వ్యక్తిగత కారణాలతో కెరీర్‌పై ఫోకస్ చేయని మనోజ్.. ఇకపై వరసగా సినిమాలు చేస్తానంటున్నారు. ఆ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై సెటైర్లు కూడా వేసారు మనోజ్. కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయ్ టీంకు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తే.. థ్యాంక్యూ అన్న అని రిప్లై ఇచ్చి ప్రేమను చూపించారు మనోజ్. అంతేకాదు ఆవేశంలో మొదట అన్నపై అన్న సినిమాపై దుమ్మెత్తి పోసినా కూడా.. వెంటనే రియలైజ్ అయ్యాడు. తన అన్న సినిమా ఆడాలని కోరుకున్నాడు. అన్న నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుండడంతో .. ఇప్పుడు సంతోషిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్‌గా కరెక్ట్ రూట్‌లోనే ఉన్నారీయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ ఛీ.. కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌కు వెళ్లను.. ఆ పని చేయను!

Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!

బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్‌ ఓవర్ యాక్షన్

Vande Bharat: నరసాపురానికి తొలి వందే భారత్ రైలు..