Manchu Manoj – Mahesh Babu: గుంటూరు కారం రమణగాడితో సొట్టబుగ్గల సిన్నోడు.. పెద్ద ప్లానే.!

|

Jan 13, 2024 | 9:50 AM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును మంచు మనోజ్‌ కలిశాడు. ఎప్పుడు మీట్‌ అయ్యాడో తెలియదు కానీ మహేశ్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు మనోజ్‌. దీనికి ‘గుంటూరు కారంతో గుంటూరోడు’ అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడీ టాలీవుడ్ రాక్ స్టార్ . ‘మంచి మనసున్న మహేశ్‌ బాబును కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును మంచు మనోజ్‌ కలిశాడు. ఎప్పుడు మీట్‌ అయ్యాడో తెలియదు కానీ మహేశ్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు మనోజ్‌. దీనికి ‘గుంటూరు కారంతో గుంటూరోడు’ అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడీ టాలీవుడ్ రాక్ స్టార్ . ‘మంచి మనసున్న మహేశ్‌ బాబును కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా. మాస్టర్‌ మైండ్‌ త్రివిక్రమ్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా ఆల్‌ ది బెస్ట్‌. రమణ గాడి బాక్సాఫీస్‌ మ్యాజిక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు మంచు మనోజ్‌. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక ‘గుంటూరోడు’ అంటూ సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మంచు మనోజ్‌. 2017లో రిలీజైన ఈ మాస్‌ మూవీలో ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరోడు పెద్దగా ఆడలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos