Manchu Lakshmi: మంచు లక్ష్మికి లైంగిక వేధింపులు

Updated on: Nov 22, 2025 | 10:47 AM

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తాను లైంగిక వేధింపుల బాధితురాలినని వెల్లడించారు. 15 ఏళ్ల వయసులో పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడని, ఆ చేదు అనుభవం తనను ఇప్పటికీ వెంటాడుతోందని ఆమె ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా తెలిపారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మంచు లక్ష్మీ! మోహన్ బాబు కూతురిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తరువాత టీవీ షోలు చేస్తూ.. సినిమాలు చేస్తూ.. తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దానికితోడు.. తన స్లాంగ్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు వరల్డ్ వైడ్ మంచి రికగ్నైజేషన్‌ సంపాదించుకున్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు…. సమాజంలో జరిగే చాలా విషయాల పై కాస్త ఘాటుగా స్పందించే మంచు లక్ష్మీ తాజాగా.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పి ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు ఈమె. ఎస్ ! తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అంటూ షాకిచ్చారు మంచు లక్ష్మి. ఎప్పుడూ ఉన్నదున్నట్టు మాట్లాడే ఈమె.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. 15 ఏళ్ల వయసులో తన లైఫ్‌లో జరిగిన ఆ చేదు సంఘటనను అందరితో షేర్ చేసుకున్నారు. చిన్న వయసులో తాను ఎప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని అని చెప్పిన లక్ష్మి.. ఒకసారి మాత్రం పదో తరగతి హాల్ టికెట్ల కోసం.. పబ్లిక్ బస్సులో వెళ్లానని.. అప్పుడే.. ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఎమోషనల్ అయింది. అ టైంలో తాను షాక్ అయ్యానని.. ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ చేదు జ్జాపకాలు తనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయంటూ.. చెప్పుకొచ్చారు ఈమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్ షోలో కుప్పకూలిన యుద్ధ విమానం !!

ఏపీకి మరో తుఫాన్ గండంమరో 4 రోజుల్లో భారీ వర్షాలు