Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు

Updated on: Nov 29, 2025 | 10:57 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మంచు కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించారు. అప్పట్లో నిశ్శబ్దంగా ఉన్నా, లోలోపల తీవ్రంగా బాధపడినట్లు తెలిపారు. దేవుడు వరం ఇస్తే కుటుంబం పాత రోజుల్లా తిరిగి కలవాలని కోరుకుంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని గొడవలున్నా కుటుంబ బంధాలు ముఖ్యమని లక్ష్మి ఉద్ఘాటించారు.

మంచు కుటుంబ కలహాలు.. అప్పట్లో తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. అందర్నీ షాకయ్యేలా చేశాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు ఎటువైపు దారితీస్తాయో అని అందరూ అనుకునేలా చేశాయి. అయితే ఈ గొడవలపై అప్పట్లో సైలెంట్‌గా ఉన్న మంచు లక్ష్మీ ఇప్పుడు నోరు విప్పారు. మంచు కుటుంబంలోని విభేదాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాక్టయ్యారు. తన మనసులోని మాటలను బయట పెట్టారు. దేవుడు నిజంగా ఒక వరం ఇస్తానంటే తమ కుటుంబం మళ్లీ పాత రోజుల్లోలా ఒక్కటై ఉండాలని కోరకుంటానన్నారు మంచు లక్ష్మి. ఏ కుటుంబంలో నైనా గొడవలు రావడం సహజం. కానీ ఎన్ని తగాదాలు జరిగినా చివరికి మన‌తో మిగిలేది కుటుంబమే. రక్త సంబంధాలను దూరం చేసుకోకుండా వాటిని కాపాడుకోవడమే ముఖ్యం. ఈ విషయంలో తాను రియాక్ట్ అవ్వనందుకు చాలా మంది తనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఏం బాధ లేదన్నానని గుర్తు చేసుకున్నారు లక్ష్మీ. కానీ తాను అనుభవించిన బాధ, కలత తనకు మాత్రమే తెలుసన్నారు. ఆ సమయంలో జరిగిన ప్రతీదీ తనను లోలోపల నుంచి చాలా బాధించాయని ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

Cyclone Ditwah: దూసుకొస్తున్న ‘దిట్వా’.. టార్గెట్‌ ఏపీ, తమిళనాడు

Bigg Boss Telugu 9: డేంజర్‌ జోన్ లో.. సుమన్ శెట్టి