మా హీరో,హీరోయిన్లకు సపరేట్ రూం ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నాం.. లేడీ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో డ్రగ్స్ వ్యవహారం చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో చాలా మంది చిక్కుకున్నారు. స్టార్ హీరోల, హీరోయిన్స్ పేర్లు కూడా డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం చాలా కామన్ అంటూ నటి, నిర్మాత సాండ్రా థామస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
సినిమా షూటింగ్ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైందని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని చెప్పి షాక్ ఇచ్చింది. మలయాళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి నిర్మాత, నటి సాండ్రా థామస్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో, సినీ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైనదని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమవుతోందని, సినీ సంఘాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆమె విమర్శించారు. ఈ సమస్య గురించి అందరికీ తెలుసని చెప్పిన సాండ్రా.. తెలిసినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. డ్రగ్స్ వాడకం పురుషులు, మహిళలు, అన్ని స్థాయిల వారిలోనూ కనిపిస్తోందని చెప్పారు. ఈ సమస్యను అరికట్టడానికి సినీ సంఘాలు గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే సెట్స్‌లో మహిళా నిర్మాతలను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలలో చేర్చాలని ఆమె సూచించారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పై ఇంకా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని సాండ్రా థామస్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సబ్బు తెచ్చిన తంట.. చిక్కుల్లో తమన్నా! కన్నడ ప్రజలు సీరియస్
దీపిక బ్యాడ్‌లక్ కాస్తా.. రుక్మిణీ గుడ్‌లక్ అయిందిగా.. ప్రభాస్ పక్కన బంపర్ ఆఫర్
అమర జవాన్ కుంటుంబానికి ఆర్థిక సాయం.. చిన్న హీరోయిన్ పెద్ద మనసు !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

