Mahesh-Trivikram movie: మహేష్‌ కోసం రూ.10 కోట్ల లగ్జరీ హౌస్‌ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్‌.. అదిరిపోయే అప్డేట్..

|

Feb 18, 2023 | 8:36 PM

వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు అదే జోష్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది.

వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు అదే జోష్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఇటీవలే ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తదుపరి షెడ్యూల్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌.త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెకెండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ లగ్జరీ హౌస్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. దీని కోసం ఏకంగా 10కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్‌లోనే జరగనుందని సమాచారం. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా సెకెండ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 18, 2023 08:35 PM