జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో

Updated on: Dec 25, 2025 | 12:18 PM

వారణాసిలో మహేష్ బాబు పాత్రకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరల్ అవుతుంది. పవర్‌ఫుల్‌ పాత్ర "రుద్రుడి'' కోసం పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో శిక్షణ పొందినట్లు మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనర్ హరిక్రిష్ కాకాని బయటపెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన హరిక్రిష్ కాకాని.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు వారణాసి కోసం ట్రైనింగ్‌ ఇచ్చాడు. లేటెస్ట్ గా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేసాడు కాకాని.

వారణాసిలో మహేష్ బాబు సాహసికుడిగా నటిస్తున్నారు. గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌లోని ఒక సన్నివేశానికి, కేరళ లో ఆవిర్భవించిన కలరిపయట్టును మహేష్‌కు శిక్షణ ఇవ్వడం గర్వంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశాడు. తను గత సంవత్సరం మహేష్ బాబుకు ట్రైనింగ్ ఇచ్చాననీ కానీ సరైన టైం వచ్చేవరకూ ఈ విషయాన్ని లీక్ చేయకూడదని రాజమౌళి బృందం కోరినట్లు చెప్పుకొచ్చాడు. అందువల్ల ఈ ప్రెస్టీజియస్ మూమెంట్ ఇప్పటివరకూ ఎక్కడ వెల్లడించలేదనీ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేస్తానని అనుకోలేదనీ ఈ ఏడాది జనవరిలో వారణాసి షూటింగ్‌కు వెళ్లే ముందే మహేష్ సర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారనీ కలరిపయట్టు అందులో భాగమే అని చెప్పుకొచ్చాడు. తను ఆయన కంటే వయసులో చాలా చిన్నవాడిననీ అయితే మహేష్‌ తనను గౌరవించిన విధానం చూసి ఆశ్చర్యపోయాననీ అన్నాడు. తను చెప్పిన ప్రతి పనీ చేసేవారనీ మొదట రెండు నెలలు అనుకున్న ట్రైనింగ్‌ ఆ తర్వాత మరికొన్ని నెలలు పొడిగించాం అని హరిక్రిష్ తెలిపాడు. ఇపుడు ఈ క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో

Published on: Dec 25, 2025 11:59 AM