షూటింగ్‌లో జక్కన్న టార్చర్ తట్టుకోలేకపోయా
ఎస్.ఎస్.రాజమౌళి-మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రానికి 'వారణాసి' టైటిల్ ఖరారైంది. టైటిల్ గ్లింప్స్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిష్కరించారు. ఈ మూవీలో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ తన 'కుంభ' పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కీరవాణి 2027లో సినిమా విడుదలవుతుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రియాంక చోప్రా రాజమౌళిని ప్రశంసించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి సూపర్ కిక్కిచ్చే న్యూస్. ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి వారణాసి టైటిల్ ఖరారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మూవీలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ .. ‘‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా మహేశ్ ‘పోకిరి’. ‘వారణాసి’ కథకు, అందులోని పాత్రకు మహేశ్ బాబు పూర్తిగా అర్హుడు. రాజమౌళి గారు ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఐదు నిమిషాలు చెప్పగానే వెంటనే అంగీకరించాను. ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను. ఈ చిత్రంలో నా ‘కుంభ’ పాత్ర శారీరకంగా, మానసికంగా నాకు ఒక పెద్ద సవాల్‌గా నిలిచింది. షూటింగ్‌లో నేను నిజంగా టార్చర్ అనుభవించాను’’ అని నవ్వుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ మూవీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చేశారు. ఇటీవల మహేశ్ బాబు అభిమానుల గుండెల్లో ఓ కొత్త ఫ్లాట్ కొన్నాను. 2027లో గృహ ప్రవేశం అంటూ తనదైనశైలిలో కీరవాణి సినిమా విడుదల తేదీని పరోక్షంగా వెల్లడించారు. కథానాయిక ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. రాజమౌళి గారు ఒక విజనరీ డైరెక్టర్. భారతీయ సినిమాను ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి గొప్ప కళాకారులతో పనిచేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహేశ్ బాబు డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??
మన ఇస్రోకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు.. వచ్చే ఏడాది భారీ టార్గెట్ !!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సేవా టికెట్లు రిలీజ్ అప్పుడే
