మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

Updated on: Nov 13, 2025 | 12:34 PM

ఎస్ఎస్ఎంబీ 29 ఈవెంట్ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ చిత్ర టైటిల్, వీడియో గ్లిమ్స్, రిలీజ్ డేట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వారణాసి టైటిల్ గా ప్రచారమైనా, ఇప్పుడు సంచారి, రుద్ర వంటి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. రాజమౌళి ప్లానింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎస్ఎస్ఎంబీ 29 ఈవెంట్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభిమానుల ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. ఎలాంటి అప్డేట్ లేకుండానే సినిమాను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన మహేష్ బాబు అభిమానులు, ఇప్పుడు వరుస అప్డేట్స్ తో మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేసే స్థాయిలో ఎస్ఎస్ఎంబీ 29 అనౌన్స్‌మెంట్ ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను మొదలుపెట్టిన రాజమౌళి, తొలి ఈవెంట్‌ను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్ ను ప్రకటిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు, వీడియో గ్లిమ్స్, విడుదల తేదీని కూడా వెల్లడిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పట్ట పగలే దారుణం.. కళ్లల్లో కారం కొట్టి వీడియో

భద్రాద్రిలో జై శ్రీరామ్ ఇటుకలు.. వీడియో వైరల్