Mahesh Babu: మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి!

Updated on: Jul 28, 2026 | 5:28 PM

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రబృందానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాపై తమ కుటుంబం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ట్రైలర్, పాటలు, దర్శకుడు అజయ్ భూపతి పనితీరును ప్రశంసించిన ఆయన, వైజయంతి మూవీస్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జయకృష్ణ, రషాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జులై 30న సినిమా విడుదల కానుంది.

అగ్ర నటుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రబృందానికి ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా కోసం తమ కుటుంబమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని పేర్కొంటూ ఆయన ఒక వీడియో సందేశాన్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. “ఈ మూవీ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. నటీనటులను ఇంత చక్కగా చూపించినందుకు క్రెడిట్ అంతా దర్శకుడు అజయ్ భూపతికే దక్కుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతంలో నాకు ‘అలెల్లే అలెల్లే’ పాట బాగా నచ్చింది” అని ప్రశంసించారు. అలాగే, వైజయంతి మూవీస్ బ్యానర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. “నేను, అల్లు అర్జున్, రామ్ చరణ్ మేమంతా వైజయంతి బ్యానర్‌లోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యాం. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా జయకృష్ణ వెండితెరకు ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. అభిమానులంతా జయకృష్ణ, రషాలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అంటూ వీడియో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఈ మూవీ జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!

Loading...
Unable to load recommendations.
Follow Us