Mansoor Ali Khan: ఈ మన్సూర్ అలీ ఖాన్ మామూలోడు కాదుగా..!!

|

Dec 12, 2023 | 5:58 PM

త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్‌తో.. ఇండస్ట్రీ మొత్తం షాకయ్యింది. మన్సూర్ పై తీవ్రంగా మండిపడింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి త్రిషకు మద్దతుగా నిలిచారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ఒకప్పటి హీరోయిన్ ఖుష్బు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్‌తో.. ఇండస్ట్రీ మొత్తం షాకయ్యింది. మన్సూర్ పై తీవ్రంగా మండిపడింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి త్రిషకు మద్దతుగా నిలిచారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ఒకప్పటి హీరోయిన్ ఖుష్బు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తంగా ఈ వ్యవహారం ముదురు పాకన పడటంతో మొదట్లో తన వ్యాఖ్యల్లో తప్పేం లేదని బలంగా చెప్పిన మన్సూర్ చివరకు దిగొచ్చాడు. త్రిషకు సారీ చెప్పాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందనుకున్నారు చాలామంది. అయితే మన్సూర్‌ మళ్లీ గొడవను రాజేశాడు.

Published on: Dec 12, 2023 05:56 PM