మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే

Updated on: Oct 15, 2025 | 6:35 PM

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ రీసెంట్‌గా రిలీజ్‌ అయి రికార్డులు క్రియేట్ చేసింది. ఫిల్మ్ ఫెటర్నిటీలోని మేకర్స్‌ను షాకచయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఫాలో అవుతూ మరో యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది అదే కురుక్షేత్ర! మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టానికి దృశ్యరూపం ఇస్తూ... తెరకెక్కిన యానిమేటెడ్ సిరీస్ 'కురుక్షేత్ర'. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఉజాన్ గంగూలీ దర్శకుడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్‌గా తెరకెక్కించారు. ఛాప్టర్-1 పేరుతో ఇప్పుడు తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఈనెల 24న మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేయనున్నారు. మహాభారతం అంతులేని సబ్జెక్ట్. ఎంత చెప్పినా అస్సలు తరగదు. దీనిపై ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. జనాలని అలరించాయి. నెట్‌ఫ్లిక్స్ మాత్రం 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని మాత్రమే తీసుకుని ఈ ‘కురుక్షేత్ర’ సిరీస్ తీసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ముందే యానిమేటెడ్ సిరీస్ అని చెప్పేశారు కాబట్టి ఓ అంచనా ఉంటుంది. దాన్ని అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. గ్రాఫిక్స్, తెలుగు డబ్బింగ్, కథని చెప్పే విధానం.. ఇలా ప్రతిదీ టాప్ రేంజులో ఉన్నాయి.అయితే ఉన్నది ఉన్నట్లు చెబితే చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఓవైపు యుద్ధాన్ని చూపిస్తూనే మరోవైపు ఫ్లాష్ బ్యాక్స్ కూడా చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. కౌరవుల దగ్గరకెళ్లి సంజయుడి రాయబారం చేసే సీన్స్‌తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. రెండో ఎపిసోడ్‍‌కి యుద్ధం ప్రారంభమైపోతుంది. అక్కడి నుంచి భీష్ముడి మరణం, పద్మవ్యూహంలో బంధించి అభిమన్యుడిని కౌరవులు చంపడం, జయద్రధుడిని అర్జునుడు సంహరించే సీన్.. ఇలా గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా తీశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srija: ఆయనే అలా చేస్తే ఎలా ?? సోషల్ మీడియాలో చర్చ

యూరప్ లో ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్ షూట్

ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్‌

అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా

పాన్ ఇండియా ట్రెండ్ లో పెరిగిన గ్రాఫిక్స్ వాడకం