18 ఏళ్లు ఎదురుచూసినా..ఆ కోరిక తీరకుండానే.. పాపం! కోట

Updated on: Jul 16, 2025 | 8:05 PM

సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు తోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 750 కు పైగా సినిమాల్లో నటించారు. తండ్రిగా, తాతగా, మామగా, బాబాయ్‌గా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఆడియెన్స్ చేత చప్పట్లు కొట్టించుకున్నారు.

తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ, నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే తన 40 ఏళ్ల సినిమా కెరీర్ లో కోట శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒకటుంది. దాని కోసం ఆయన 18 ఏళ్ల పాటు పరితపించారట. కానీ అది నెరవేరలేదట. కోటకు తీరకు కోరిక ఏంటంటే.. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి నటించడం. అవును.. తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక్క సీన్ లో నైనా కలిసి నటించలేదే అన్న బాధ ఆయనలో ఉండేదట. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఈ అవకాశం కోసం ఆయన 18 ఏళ్లు ఎదురు చూశారట. కానీ అది నెరవేరలేదు. కోట శ్రీనివాస రావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికే ఎన్టీఆర్ ఇండస్ట్రీని వదిలి పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం మూడు, నాలుగు సినిమాల్లోనే నటించారు ఎన్టీఆర్. చివరికీ ఆ సినిమాల్లోనూ కోటకు అవకాశం రాలేదు. చివరకు ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాత్ర కోసం కోటకు పిలుపు వచ్చింది. కానీ.. అప్పటికే కోటకు బిజీ షెడ్యూల్‌ ఉండడంతో ఆ ఛాన్స్ కూడా పోయింది. చివరకు మేజర్ చంద్ర కాంత్ సినిమానే ఎన్టీఆర్ ఆఖరి మూవీ కావడంతో కోట శ్రీనివాసరావు కోరిక తీరలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొంచెం తింటే ఏం కాదులే అనుకుంటున్నారా.. అదే డేంజర్‌

అదేమన్నా బొమ్మ అనుకుంటివా.. ప్రాణాలు తీసే కింగ్ కోబ్రా.. అలా ఎలా నిలబెట్టావ్ అన్న