నెలకు రూ.30లక్షల జీతాన్ని వదిలి.. హీరోగా మారిన కుర్రాడు

Updated on: Oct 08, 2025 | 12:43 PM

లక్షలాది మంది సినిమా ప్రపంచంలోకి రావాలని కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చే సాహసం చేస్తుంటారు. నటనపై ఆసక్తితో అప్పటికే చేస్తున్న ఉద్యోగం వదిలేసిన తారలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. కానీ మీకు తెలుసా.. ? ఒక యువకుడు నెలకు రూ.30 లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఇప్పుడు అతడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు.. ఓటీటీని శాసిస్తున్నాడు. ప్రస్తుతం ఒక పెద్ద వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అతడి పేరు లక్ష్య లాల్వానీ. ఈ పేరు సౌత్ సినీప్రియులకు అంతగా పరిచయం లేదు. కానీ ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో అతడి పేరు మారుమోగుతుంది. లక్ష్య లాల్వానీ..! కిల్ మూవీ.., ఇప్పుడు సక్సెస్ అయిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో లక్ష్య హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లోనే ఈ హీరో తన గతం గురించి.. తాను చేసిన జాబ్ గురించి రివీల్ చేశాడు. నటనా రంగంలోకి రాకముందు తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా చాలా డబ్బు సంపాదించానని చెప్పుకొచ్చాడు ఈ హీరో. రోజుకు కనీసం రూ. 15,000 సంపాదించేవాడినని.. కొన్నిసార్లు రూ. 25,000 వచ్చేవని అన్నారు. గతంలో నెలకు రూ.30 లక్షలు కూడా వచ్చేవని చెప్పారు. కానీ సినిమాపై ఇష్టంతో రిస్క్ అయినప్పటికీ ఉద్యోగాన్ని వదిలేసినట్లు చెప్పుకొచ్చారు ఈ హీరో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kantara: Chapter 1: 1000 కోట్లా.. అంత సీన్‌ ఉందంటారా ??

నెల తిరగకుండానే OTTలోకి OG ?? బయటికొచ్చిన డేట్ !!

బాబుకు దక్కాల్సింది తరుణ్‌ ఎగరేసుకుపోయాడు !! ఇదే లక్కంటే !!