ఓర్రీ మేనేజర్‌గా పని చేస్తున్న.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Updated on: Mar 31, 2025 | 9:05 AM

కిమ్ శర్మ! ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఒక్క ఖడ్గం సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీ ఓర్రీ వద్ద మేనేజర్ గా పనిచేస్తుంది.

బాలీవుడ్ సినిమా ఈవెంట్స్, పార్టీలలో కనిపించి సినీతారలతో వెరైటీగా ఫోటోలకు ఫోజులిచ్చి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి. నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓర్రీకి మేనేజర్ గా పనిచేస్తోంది కిమ్ శర్మ. ఇక కిమ్ శర్మ.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె ఓరి అవతార్మణి అకా ఓరి విజయం వెనుక ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇక నివేదికల ప్రకారం ఓర్రీ మేనేజర్ గా పనిచేస్తూ కిమ్ శర్మ ఆస్తులు రూ.10 కోట్లకు పైగానే సంపాదించినట్లు సమాచారం.

మరిన్ని వీడియోలు :

స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. ఇప్పుడు ‘ఎంపురాన్’ సినిమా పరిస్థితి దారుణం 

వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు

ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!