OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!

Updated on: Aug 07, 2025 | 7:08 PM

పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న సినిమా మహావతార్ నరసింహ. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్‌ను కూడా క్రియేట్ చేసి... జస్ట్ 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబట్టిన ఫస్ట్ యానిమేషన్ సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

అయితే సక్సెస్‌ ఫుల్‌గా.. నరసింహ మూవీ.. స్టిల్‌ థియేటర్స్‌లో రన్ అవుతున్నా కూడా… కొంత మంది ఓటీటీ అప్డేట్స్‌ పై ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు బిగ్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్. తొందర్లో ఈ సినిమా ఓటీటీకి వస్తుందని అనుకుంటున్న వారికి బిగ్ ఝలక్‌ కూడా ఇచ్చారు. శ్రీ మహావిష్ణు నరసింహావతారం ఆధారంగా అశ్విన్ కుమార్ డైరెక్షన్లో కన్నడలో రూపొందించిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ. జులై 25న తెలుగుతోపాటు పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఓవైపు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఓ ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా సెప్టెంబరులో గానీ.. లేదా అక్టోబర్ లో గానీ స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకుంది. మహావతార్ నరసింహ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందనే ప్రచారం మా దృష్టికి వచ్చింది. దానిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తాము ఖరారు చేయలేదు. మా సోషల్ మీడియా ఖాతాలో వచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మండి ‘ అంటూ పోస్ట్ చేసింది. దీంతో మహవతార్ నరసింహా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పట్లో లేదనే క్లారిటీ ఈ ఫ్యాన్స్‌లో వచ్చింది. ఇదే న్యూస్ వారిని కాస్త డిస్సపాయింట్ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తను చదివించిన డాక్టర్లను చూసి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో

Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..

ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్‌ టు విజయవాడ

ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. 84 % మందికి ఆ డిసీజ్

పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందటం.. ఇక ఈజీ కాదు