Junior: జూనియార్ రివ్యూ.. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే!

Updated on: Jul 18, 2025 | 6:28 PM

మైన్స్ మ్యాన్ గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటి.. జూనియర్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇచ్చాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది!!. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే.. డిఫరెంట్‌ పాయింట్‌తోనే కథ మొదలవుతుంది. లేటు వయసులో కోదండపాణి దంపతులకు హీరో కిరీటి అలియాస్ అభి పుట్టడం.

అభి పుట్టగానే తల్లి చనిపోవడం.. దీంతో అభిని తండ్రి కోదండపాణి అలియాస్ వి.రవిచంద్రన్‌ అల్లారుముద్దుగా పెంచడం.. తండ్రి ప్రేమను హీరో కాస్త ఇబ్బందిగా ఫీలవడం..! ఇలా ఫాదర్ అండ్ సన్ సెంట్రిక్‌గా ఫస్ట్ ఆఫ్ సాగుతుంది. ఇదే ఫస్టాఫ్‌లో శ్రీలీలతో కాలేజ్‌లో లవ్.. అండ్ ఫన్..!!! ఇలా.. పడుతూ లేస్తూ ఫస్టాఫ్ ముందుకు వెళుతుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చే సరికి జెనీలియా అలియాస్ విజయ సౌజన్య ఎంట్రీతో ఎమోషన్ మారుతుంది. ‘తండ్రి – కూతురు’ షేడ్ తీసుకుంటుంది. అందులోనూ తన ఆఫీస్‌ బాస్ జెనీలియాకి కిరీటికి మధ్య అసలు సంబంధం ఏంటనేది కూడా మనకు క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఎమోషన్. తండ్రి- కొడుకు, తండ్రి – కూతురు మధ్య ఎమోషన్‌ సీన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. దీనికితోడు క్లైమాక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఉంటుంది. అది మనల్ని షాకయ్యేలా చేస్తుంది. ఇక కిరీటి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉంటుంది. మనోడి యాక్టింగ్‌లో ఈజ్ ఉంది. ఎనర్జీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. వీటికి మించి కిరీటి డ్యాన్స్‌ టాప్ నాచ్‌. వైరల్ వయ్యారి పాటలో .. ఏకంగా శ్రీలీలనే డామినేట్ చేసిపడేశాడు. అంతేకాదు తన డ్యాన్సింగ్ స్టైల్‌తో తన ఫేవరట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఖచ్చితంగా గుర్తుకుతెస్తాడు. డీఎస్పీ సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు వన్‌ ఆఫ్ ది ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్లలో దేవీ మ్యూజిక్‌కి… కళ్లలో నీళ్లు తిరగడం పక్కా. ఇక ఓవర్‌ ఆల్‌గా చెప్పాలంటే జూనియర్ సినిమాతో కిరీటి ఇండస్ట్రీలో చాలా గట్టిగా పాతుకుపోతాడంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు షాక్ రాజాసాబ్ రిలీజ్ పోస్ట్‌ పోన్?

చిరంజీవి వినతిని పట్టించుకోని GHMC.. ఊహించని షాకిచ్చిన మెగాస్టార్

మహేష్‌ సినిమా కోసం నన్ను అందుకే వద్దనుకున్నారు..

బాబును హాలీవుడ్‌లో నిలబెట్టేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్స్

OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి

Published on: Jul 18, 2025 06:28 PM