Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్
రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక శర్మ గ్లామర్ గుర్తింపు పొందినా, కెరీర్‌లో సక్సెస్ మాత్రం దక్కలేదు. సినిమా ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయో లేదో చూడాలి.
రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ కేతిక శర్మ, తొలి చిత్రంతోనే గ్లామర్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు సక్సెస్ దక్కలేదు. రొమాంటిక్ తర్వాత నాగశౌర్యతో నటించిన లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో చేసిన రంగ రంగ వైభవంగా చిత్రాలు నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కేతిక శర్మకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు లేకపోవడంతో, ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. గ్లామరస్ ఫోటోలు, వీడియో సింగిల్స్‌తో ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెండితెరపై వర్కౌట్ కాని గ్లామర్ ఇమేజ్ సోషల్ మీడియాలోనైనా ఆమెకు హెల్ప్ అవుతుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Sethupathi: జైలర్ 2 సెట్‌లో విజయ్ సేతుపతి.. బాలయ్య గెస్ట్ రోల్ లేనట్టేనా ?
