అది నా తప్పే.. జగ్గూభాయ్‌కి సారీ చెప్పిన కీర్తి

Updated on: Oct 17, 2025 | 4:11 PM

చేసిన తప్పు ఒప్పుకుంటే పోతుందంటారు. క్షమించమని అడితే.. ఓ పనైపోతుందంటారు. ఇప్పుడు కీర్తి సురేష్‌ కూడా ఇదే చేశారు. జగపతి బాబుకు బే షరుతుగా సారీ చెప్పారు. అలా చేయకుండా ఉండాల్సింది అంటూ.. సంజాయిషీ ఇచ్చారు. జగ్గూ కూడా కీర్తి సారీస్‌ను యాక్సెప్ట్ చేసుకుని ఆమెను మన్నించేశాడు. ఇక అసలు విషయం ఏంటంటే.. జగ్గూ బాయ్‌ రీసెంట్‌గా జయమ్ము నిశ్చయమ్మురా పేరుతో ఓ సెలబ్‌ టాక్‌ షోను స్టార్ట్ చేశాడు.

స్టార్ హీరోలు.. హీరోయిన్లను తీసుకొస్తూ.. వారితో మాట మంతీ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా కీర్తి సురేష్‌ను తన షోకు తీసుకొచ్చాడు. ఇక ఈ షోకు వచ్చిన కీర్తి సురేష్‌.. జగ్గూ తో చాలా విషయాలు పంచుకోవడంతో పాటే.. ఆయనకు సారీ కూడా చెప్పి అందరికీ షాకిచ్చారు. ఇటీవల తన చిన్న నాటి ఫ్రెండ్ అండ్ లవర్‌ ఆంటోనీ ని పెళ్లి చేసుకున్న కీర్తి.. ఆ పెళ్లికి జగపతి బాబను పిలవలేదు. ఇక ఈ విషయంగానే ఆయనకు క్షమాపణలు చెప్పారు. ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి తన ప్రేమ గురించి తెలుసని, వారిలో జగపతి బాబు కూడా ఒకరాన్నారు కీర్తి. “పెళ్లిఅయ్యే వరకూ నా ప్రేమ గురించి చాలా తక్కువమందికి చెప్పాను. నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి మీతో నా వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాను. కానీ, పెళ్లికి పిలవలేకపోయాను. క్షమించండి’’ అని కీర్తి అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్‌ సైనికుల ప్యాంట్లు ఊడగొట్టాం.. ఇదిగో సాక్ష్యం.. తాలిబన్ల వీధి ప్రదర్శన

భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్… నవంబరు 26నే అధికారిక ప్రకటన

ఆలయ ప్రాంగణంలో వింత ఆకారం.. విద్యుత్‌ కాంతుల మధ్య ధగధగా మెరుస్తూ

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌

కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం