పండంటి బాబుకు జన్మనిచ్చిన కత్రినా.. ఖుషీ.. ఖుషీగా ఛావా హీరో
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 7న కత్రినా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ప్రేమకు ప్రతిరూపంగా బాబు పుట్టాడని.. గుడ్ న్యూస్‌ను తన సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నాడు విక్కీ. అంతేకాదు తాను ఎంతో సంతోషిస్తున్నట్టు తన ట్వీట్లో రాసుకొచ్చాడు.
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 7న కత్రినా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ప్రేమకు ప్రతిరూపంగా బాబు పుట్టాడని.. గుడ్ న్యూస్‌ను తన సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నాడు విక్కీ. అంతేకాదు తాను ఎంతో సంతోషిస్తున్నట్టు తన ట్వీట్లో రాసుకొచ్చాడు. అందరి ఆశీర్వాదాలు తమ చిన్నారిపై ఎప్పుడూ ఉండాలంటూ ఆకాక్షించాడు. ఇక విక్కీ షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విక్కీ ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే విక్కీని విష్ చేస్తూ ఆయన అభిమానులు పోస్టులు పెట్టడం కనిపిస్తోంది. ఇక కొన్నాళ్లు ప్రేమలో ఉన్న కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కత్రినా పూర్తిగా సినిమాలు మానేయకున్నా.. సెలక్టెడ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటోంది. ఇక మరో పక్క విక్కీ కౌషల్ మాత్రం ఛాలెంజ్ ఉన్న రోల్స్ చేస్తూ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనే టాప్ స్టార్‌గా ఎదిగాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్
విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??
The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?
