Kantara: కాంతారను వెంటాడుతున్న మరణాలు

Updated on: Aug 09, 2025 | 5:37 PM

కాంతార సినిమాటీంను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో భాగమైన నటులు, టెక్నీ షియన్లు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటీవలే కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర బృందమంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంటోంది.

ఈక్రమంలోనే కాంతార సినిమాలో నటించిన మరో నటుడు మరణించడం కన్నడ నాట సంచలనంగా మారింది. కాంతార మొదటి భాగంలో నటించిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ టి. ప్రభాకర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఉడిపి జిల్లాలోని హెబ్రీ తాలూకాలోని పెర్దూర్ కు చెందిన ప్రభాకర్ కాంతారా చిత్రంలో మహాదేవ పాత్రను పోషించారు. ప్రభాకర్ కు నాటక రంగంపై చాలా ఆసక్తి ఉండేది. వివిధ నాటకాల్లోనూ ఆయన నటించారు. ఈ క్రమంలోనే కాంతార పార్ట్ 1లోనూ ఛాన్స్ దక్కించుకున్నారు. అంతేకాదు‘కాంతార’ సినిమా కోసం ఆయన దాదాపు ఒక సంవత్సరం పాటు గడ్డం తీయించుకోలేదని చెబుతారు. అయితే సుమారు ఐదేళ్ల క్రితమే ప్రభాకర్ కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు ఆగస్టు 8న మరో సారి ఛాతి నొప్పి రావడంతో ఆయన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రభాకర్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. నటుడి మృతితో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అలాగే ప్రభాకర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నరాలు కట్ అయ్యేంత సస్పెన్స్! ఇంతకీ ఆ హత్య చేసిందెవరు..?

ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే పుష్పరాజ్‌ రికార్డ్స్‌ను రాజాసాబ్‌ పాతేస్తాడేమో..!

బైక్ పార్కింగ్‌ గొడవ కోపంతో.. హీరోయిన్ సోదరుడి దారుణ హత్య